తెదేపా డేటా కేసీఆర్ సహకారంతో వైకాపా తస్కరిస్తోందని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన ఆధారాలను మంత్రి బహిర్గతం చేశారు. గొల్లపూడిన చెందిన తెదేపా కార్యకర్త శీను నాయక్‌కు వైకాపా కాల్‌సెంటర్ నుంచి వచ్చిన ఫోన్ వాయిస్ రికార్డును మీడియా ముందు ప్రదర్శించారు. పక్క రాష్ట్రం నుంచి వచ్చిన కొందరు ఫోన్లు చేసి... ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ మభ్య పెడుతున్నారని విమర్శించారు.
'ఇవిగో ఆధారాలు ' - it grid
తెదేపా కార్యకర్తలు, నేతల సమాచారమే చోరీకి గురైందని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. డేటాను కేసీఆర్ సహకారంతో వైకాపా తస్కరిస్తోందని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను మీడియా ముందుకు తీసుకొచ్చారు.
మంత్రి దేవినేని