'ఊరుకోం - బదులిస్తాం' - jagan
తెదేపాపై వైకాపా, తెరాస చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని మంత్రి దేవినేని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో 28 లక్షల ఓట్లను తొలగించి అక్రమాలకు పాల్పడిన తెరాస... ఇప్పుడు అదే పద్ధతిలో ఏపీలో జగన్ని గెలిపించడానికి కుట్రలకు తెరలేపాడని ఆరోపించారు. ఈ విషయంపై జాతీయ స్థాయిలో చర్చకు తెరలేపుతామని స్పష్టం చేశారు.
ఫాం-7 ద్వారా ఆంధ్రాలో 58 లక్షల ఓట్లను తొలగించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలు పన్నుతున్నారని మంత్రి దేవినేని ఆరోపించారు. తన సామంత రాజైన జగన్ని గెలపించేందుకు కేసీఆర్ ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. ఫాంహౌస్లో కూర్చొని వైకాపా అభ్యర్థుల జాబితాను కేసీఆర్ రూపొందిస్తున్నారని విమర్శించారు. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలవుతుంటే ఓర్వలేక కుట్రలకు పాల్పడుతున్నారని విజయవాడ తెదేపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మండిపడ్డారు. ఆంధ్రా పోలీసులపై తప్పుడు కేసులు నమోదు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైకాపా చర్యలను సమర్థవంతంగా తిప్పి కొడతామనిస్పష్టం చేశారు.