ఇంటింటీకీ గ్యాస్ కనెక్షన్లు, ఇంటింటీ కుళాయి మనకి తెలుసు... మన రాజధానిలో భవిష్యత్తులో ఇంటింటికీ ఏసీ కనెక్షన్లు రానున్నాయి. ఏపీ ప్రభుత్వం, రాజధానిలో కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ ఏర్పాటు చేయనుంది. ఈ పరిశ్రమ ఏర్పాటుకు యూఏఈ కి చెందిన తబ్రీద్ కంపెనీతో సీఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది.
20 వేల టన్నుల సమార్ధ్యంతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. 30ఏళ్ల పాటు ఒప్పందం కొనసాగనుంది. అమరావతి నిర్మించనున్న కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ, గల్ఫ్ సహకార సమాఖ్య బయట నిర్మిస్తున్న మొదటి ప్రాజెట్ అని తబ్రీద్ సంస్థ తెలిపింది.
ఉద్యోగ కల్పన, ప్రపంచ స్థాయి సదుపాయాలు, హరిత నగరం నిర్మాణాన్ని దృష్టిలో ఉంటుకొని కేంద్రీకృత శీతలీకరణ వ్యవస్థ నిర్మించనుంది. ముఖ్యంగా అమరావతి నగరాన్ని ప్రపంచ స్థాయి నగరాల చెంతన నిలపాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం దీన్ని చేపట్టనుంది.
2021 కల్లా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, సచివాలయం, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలకు ఏసీ కనెక్షన్లు ఇవ్వనున్నారు. రాబోయే రోజుల్లో ఈ సదుపాయాన్ని సాధారణ గృహాలకూ విస్తరించనున్నారు.
"భారత దేశంలో మొదటి కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటు చేయడంతో ప్రపంచంలో అతి పెద్ద, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లోకి తబ్రీద్ అడుగుపెట్టింది. ఏపీసీఆర్డీఏతో దీర్ఘకాలభాగస్వామ్యం పెట్టకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా సంస్థ ఏపీ అభివృద్ధి భాగమౌతుందని ఆశీస్తున్నాం " - తబ్రీద్ ఛైర్మన్, ఖలేద్ అబ్దుల్లా అల్-కుబాయిసీ