ఇంటెలిజెన్స్ డీజీ పదవికి కుమార విశ్వజిత్, రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్ రామాంజనేయులు పోటీ పడుతున్నారు. అనూహ్యంగా స్టీఫెన్ రవీంద్ర పేరు తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. స్టీఫెన్ ప్రస్తుతం తెలంగాణ కేడర్‌లో హైదరాబాద్ ఐజీగా విధులు నిర్వహిస్తున్నారు. స్టీఫెన్ కెరీర్లో నక్సలిజం, ఫ్యాక్షనిజం, డ్రగ్ మాఫియాపై సమర్థవంతంగా పని చేశారనే ముద్ర వేసుకున్నారు.
స్టీఫెన్ విద్యాభ్యాసం
స్టీఫెన్ విద్యాభ్యాసం హైదరాబాద్ సెయింట్ పాల్, లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగింది. నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేశారు. అనంతరం సివిల్స్ రాసి ఐపీఎస్‌లో చేరారు. 1999 బ్యాచ్‌కు చెందిన స్టీఫెన్ రవీంద్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో పరకాల అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా మొదటిసారి పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం అదిలాబాద్ అడిషనల్ ఎస్పీగా 2004 వరకు పని చేశారు. 2004లో వరంగల్ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. అనంతపురం ఎస్పీగా పని చేసిన సమయంలో ఫ్యాక్షనిజంపై ఉక్కుపాదం మోపారు.