ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏపీకి ఐదు లక్షల కోట్ల నిధులిచ్చాం : అమిత్ షా - tdp

చంద్రబాబు అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణం జరగలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. భాజపాను అధికారంలోకి తీసుకొస్తే రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట  భాజపా ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు.

అమిత్ షా

By

Published : Apr 5, 2019, 7:37 AM IST

అమిత్ షా
చంద్రబాబు అమరావతి పేరుతో అవినీతి తప్ప ఒక్క నిర్మాణం జరగలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఆరోపించారు. భాజపాను అధికారంలోకి తీసుకొస్తే రాజధాని నిర్మాణం పూర్తవుతుందన్నారు. గుంటూరు జిల్లా, నరసరావుపేట భాజపా ఎన్నికల ప్రచార సభలో అమిత్ షా పాల్గొన్నారు. పోలవరం ప్రాజెక్టుకిచ్చిన 7 వేల కోట్లు చంద్రబాబు, ఆయన మంత్రులు దోచుకున్నారని మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో చెప్పిన 14 అంశాల్లో 11 ఇప్పటికే పూర్తి చేశామని అమిత్ షా తెలిపారు. ఇరవైకి పైగా కేంద్ర సంస్థలు ఏపీలో ఏర్పాటయ్యాయని గుర్తు చేశారు. చంద్రబాబు కుమారుడి కోసం తప్ప రాష్ట్రం కోసం ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి అవకాశవాద నాయకుడు దేశంలో మరొకరు లేరని అమిత్ షా విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే చంద్రబాబు భాజపాతో పొత్తు పెట్టుకున్నారని అమిత్ షా ఆరోపించారు. ఎన్నికల తర్వాత ఎన్డీయే అధికారంలోకి వస్తే మళ్లీ కలవాలని చూస్తున్నారని... కానీ ఎన్డీయేలోకి రానివ్వమన్నారు. ఐదేళ్లలో మోదీ సర్కారు అభివృద్ధి, సంక్షేమం కోసం పనిచేసిందన్నారు. ఉగ్రవాదాన్ని సమర్ధంగా ఎదుర్కొందని అమిత్ షా తెలిపారు. మోదీ సారథ్యంలో ఏపీకి ఇప్పటి వరకు ఐదు లక్షల కోట్లు పైగా నిధులిచ్చామన్నారు.

ఇదీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details