ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హైదరాబాద్ ఐటీగ్రిడ్స్​లో సోదాలు ప్రారంభం - tg

హైదరాబాద్​ ఐటీగ్రిడ్స్​ కార్యాలయంలో సిట్​ బృందం సోదాలు నిర్వహిస్తోంది. స్టీఫెన్​ రవీంద్ర ఆధ్వర్యంలోని క్లూస్​ టీం డేటా చోరీపై తనిఖీలు చేయనున్నారు. ఐటీగ్రిడ్స్​పై తమ పోలీస్​ స్టేషన్​లో నమోదైన కేసును సిట్​ బృందానికి అప్పగించారు ఎస్.​ఆర్​.నగర్ పోలీసులు.

ఐటీ గ్రిడ్స్​లో సోదాలు

By

Published : Mar 9, 2019, 1:46 PM IST

Updated : Mar 9, 2019, 2:29 PM IST

ఐటీ గ్రిడ్స్​లో సోదాలు
డేటాచోరీ కేసులో దర్యాప్తు కోసం తెలంగాణ సిట్​ బృందం రంగంలోకి దిగింది. స్టీఫెన్​ రవీంద్ర ఆధ్వర్యంలోని అధికారులు మాదాపూర్​లోని ఐటీగ్రిడ్స్​ కార్యాలయానికి చేరుకున్నారు. డేటా చోరీ కేసులో విచారణ మొదలైన తర్వాత మొదటిసారి ఐటీగ్రిడ్ కార్యాలయంలో సోదాలు జరుగుతున్నాయి.

ఐటీ గ్రిడ్స్​లో సోదాలు

సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర స్వయంగా మాదాపూర్​లోని ఐటీగ్రిడ్ కార్యాలయానికి వచ్చి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడంతో.. ఎస్‌ఆర్‌నగర్ పీఎస్‌లో నమోదైన కేసును సిట్​కు బదిలీ చేశారు.

Last Updated : Mar 9, 2019, 2:29 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details