ఏజీ పదవికి దమ్మలపాటి రాజీనామా..రేసులో పలువురు
రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా ఉన్న దమ్మలపాటి తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా లేఖ గవర్నర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. కీలకమైన ఏజీ పదవికి కోసం పలువురు రేసులో నిలిచారు.
రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ ( ఏజీ) దమ్మలపాటి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేశారు. ఓట్ల లెక్కింపు రోజైన ఈ నెల 23 నే అపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తన రాజీనామా లేఖను సమర్పించారు. మరసటి రోజు రాజీనామా లేఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, న్యాయ శాఖ కార్యదర్శికి చేరింది. ఆ తర్వాత గవర్నర్ ఆమోదానికి పంపినట్లు సమాచారం. కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత సంప్రదాయాన్ని గౌరవిస్తూ అప్పటి వరకు ఏజీగా కొనసాగినవారు తమ పదవికీ రాజీనామా చేయటం అనవాయితీగా వస్తోంది.
ఏజీ రేసులో పలువురు...
కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఏజీ పదవి కోసం రేసులో పలువురు నిలిచారు. సీనియర్ న్యాయవాది డీవీ సీతారామ మూర్తి, శ్రీరామ్, జానకి రామిరెడ్డిలతో పాటు మరికొందరి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో డీవీ సీతారామ మూర్తి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఏజీగా పనిచేశారు.