పేగులు చేతితో పట్టుకుని...11 కి.మీ నడిచాడు! - a person from up skipped from train and survived
ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన యువకుడు బయటకు వచ్చిన పేగులను అదిమిపట్టుకుని 11 కిలోమీటర్లు నడిచి ప్రాణాలను కాపాడుకున్నాడు.
ఉత్తరప్రదేశ్ హుసేనాబాద్‌కు చెందిన సునీల్ చౌహాన్, తన సోదరుడితో కలిసి సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు జిల్లాకు కూలీ పనుల కోసం వెళ్తున్నాడు. తెలంగాణలోని వరంగల్ సమీపంలో ఉన్న ఉప్పల్ స్టేషన్ దాటాక మరుగుదొడ్డి వద్దకు వచ్చిన సునీల్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడ్డాడు. ఈ ఘటనలో పొట్టకు గాయమై పేగులు బయటకు వచ్చాయి. చుట్టూ చీకటి ఎవరూ సాయం చేయడానికి లేకపోయినా ధైర్యం కూడగట్టుకున్నాడు. పేగులను పొట్టలోకి నెట్టి, చొక్కా విప్పి గట్టిగా కట్టుకుని రైలు పట్టాల వెంబడి నడక సాగించాడు. హసన్పర్తికి చేరుకున్నాక... సునీల్‌ను చూసిన స్టేషన్ మాస్టర్ సంజయ్‌కుమార్ పటేల్ ఆంబులెన్స్‌కు ఫోన్‌చేసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. యువకుడు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
- ఇదీ చూడండి : మూగజీవుల గురించీ కాస్త ఆలోచించండి..!