అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగం
అతి చిన్న వయస్సులోనే మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న పుష్పశ్రీవాణి అసెంబ్లీలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
నవ్యాంధ్ర శాసనసభ రెండో స్పీకర్గా తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనకు అభినందనలు తెలిపే క్రమంలో మంత్రి పుష్పశ్రీవాణి భావోద్వేగానికి లోనయ్యారు. గిరిజన మహిళైన తనను... ఉపముఖ్యమంత్రి పదవితో దేశానికి సీఎం జగన్ మంచి సందేశాన్ని ఇచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి సభాపతిగా ఎన్నిక కావడం సంతోషంగా ఉందని అన్నారు. తమ్మినేనికి స్పీకర్ బాధ్యతలను అప్పగించడం సహేతుకమని భావిస్తున్నానని అభిప్రాయపడ్డారు. గిరిజనాభివృద్ధికి మీ వంతు సహకరించాలని కోరుతున్నానని మంత్రి అన్నారు. మహిళా సమస్యలను విన్నవించుకునే అవకాశం ఇవ్వాలని స్వీకర్ను పుష్పశ్రీవాణి కోరారు.