రైతులకు ధరలస్థిరీకరణ నిధిపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. వ్యవసాయ ఉత్పత్తులు నష్టాల బారిన పడకుండా రాష్ట్రంలోని రైతుల కోసం రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని తెలిపారు.గడచిన ఐదేళ్లలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. రాష్ట్రంలో వేరుశనగ పంట మూడేళ్లుగా గోదాముల్లో మగ్గుతోందని ఆరోపించారు. కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని పేర్కొన్నారు. ఐదెకరాలకు మించకుండా క్వింటాలుకు రూ.1500 చొప్పున మద్దతు ధర చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నెలలోనే ఒక్కో రైతుకు గరిష్టంగా రూ.45 వేల చొప్పున చెల్లించామని వివరించారు.
రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి: మోపిదేవి - Mopidevi Venkata ramana
రైతుల కోసం రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తులు నష్టాల బారిన పడకుండా ఈ నిధి ఉపకరిస్తుందని ఆయన చెప్పారు.
మంత్రి మోపిదేవి వెంకటరమణ