COLORS TO PHC:బాపట్ల జిల్లా దక్షిణ అద్దంకిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పార్టీ రంగులు వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. 80లక్షల రూపాయలు వెచ్చించి అద్దంకి నగర పంచాయతీలో ఆస్పత్రి నిర్మించారు. త్వరలో ప్రారంభోత్సవం చేయనున్న వైద్యశాలకు రాజకీయ రంగులు వేయడంపై స్థానికులు చర్చించుకుంటున్నారు. అధికారులంతా బదిలీల వ్యవహారంలో తలమునకలైన నేపథ్యంలో.. ఈ అంశం గురించి పట్టించుకునే వారే లేకపోవడం గమనార్హం. అధికార భవనాలకు పార్టీ రంగులు వేయడంపై ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాల్లో చుక్కెదురైనా.. అధికార పార్టీ నాయకుల్లో స్పందన లేకపోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
YSRCP COLOURS TO PHC: ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మళ్లీ అవే రంగులు - latest news in bapatla
YSRCP COLOURS TO PHC: త్వరలో ప్రారంభించనున్న వైద్యశాలకు రాజకీయ రంగులు వేయడం బాపట్ల జిల్లాలో చర్చనీయాంశమైంది. అధికార భవనాలకు పార్టీ రంగులు వేయడంపై ఇప్పటికే పలుమార్లు న్యాయస్థానాల్లో చుక్కెదురైనా.. అధికార పార్టీ నాయకుల్లో స్పందన లేకపోవడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి పార్టీ రంగులు