ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్యోగం కోసం భర్తను చంపేసిన భార్య - wife killed her husband hit with a stick

Wife Killed Her Husband in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భర్త వేధింపులతో ఆ ఇల్లాలు విసిగిపోయింది. ఇక భరించే ఓపిక లేక ఏదో ఒకటి చేాయాలనుకుంది. భర్తను చంపితే.. వేధింపులు తప్పడంతో పాటు, కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందని ఆశ పడింది. ప్లాన్ ప్రకారమే అతడిని హతమార్చింది. జారిపడి తలకు గాయమైందని కట్టుకథ అల్లింది. కానీ, తండ్రి మృతిపై అనుమానం వచ్చి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

murder
హత్య

By

Published : Jan 5, 2023, 3:42 PM IST

Wife Killed Her Husband in Bhadradri : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాగొచ్చి నిత్యం వేధిస్తున్నాడంటూ.. భర్తను ఓ మహిళ హతమార్చింది. అయితే జారిపడి తలకు గాయమైందని అంతకుముందు కథ అల్లింది. పోలీసుల విచారణలో అసలు విషయం వెల్లడైంది. వేధింపులు తప్పడంతో పాటు, కారుణ్య నియామకం కింద భర్త ఉద్యోగం తనకు దక్కుతుందన్న ఆలోచనతో హత్య చేసినట్లు అంగీకరించింది. ఈ ఘటన వివరాలను చుంచుపల్లి ఎస్సై కె.సుమన్‌ బుధవారం వెల్లడించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గాంధీకాలనీకి చెందిన కొమ్మరబోయిన శ్రీనివాస్‌(50) కొత్తగూడెం కలెక్టరేట్‌లో అటెండర్‌గా పని చేస్తున్నారు. గత నెల 29న అర్ధరాత్రి ఆయన వంటింట్లో జారిపడ్డాడని, తలకు తీవ్ర గాయమైందని భార్య సీతామహాలక్ష్మి (43) మర్నాడు ఉదయం కొత్తగూడెంలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించింది. కొద్దిగంటల చికిత్స అనంతరం ఆయన మృతి చెందాడు. తండ్రి మృతిపై అనుమానం ఉన్నట్లు కుమారుడు సాయికుమార్‌ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తాగిన మైకంలో ఇంటికొస్తే తలపై కొట్టా..భర్తను ఆసుపత్రిలో చేర్పించిన తర్వాత కనిపించకుండా పోయిన సీతామహాలక్ష్మిపై నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఆమె కొత్తగూడెం రైల్వేస్టేషన్‌కు రాగా అదుపులోకి తీసుకుని విచారించారు. ‘‘ఆ రోజు నా భర్త తాగిన మైకంలో ఇంటికొచ్చాడు. నిద్రలోకి జారుకున్నాక కర్రతో తలపై కొట్టా. వంటగదిలోకి తీసుకెళ్లి పడుకోబెట్టా.’’ అని నిందితురాలు అంగీకరించినట్లు ఎస్సై తెలిపారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details