Rush to Suryalanka: శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి, శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో బాపట్ల మండలం సూర్యలంక సముద్ర తీరానికి పర్యటకులు పోటెత్తారు. భారీగా పర్యటకులు రావడంతో సముద్ర తీరమంతా సందడిగా మారింది. చిన్నా, పెద్ద తారతమ్యం లేకుండా సముద్ర స్నానం చేస్తూ కేరింతల కొట్టారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సముద్రపు అలల ఉద్ధృతి కారణంగా లోపలకు వెళ్ళరాదని మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు.
సూర్యలంక సముద్ర తీరానికి పోటెత్తిన పర్యటకులు - పోటెత్తిన పర్యటకులు
Tourists enjoying weekend వారాంతపు సెలవుల్లో సూర్యలంక సముద్రతీరం సందడిగా మారింది. వరుస సెలవులతో భారీ ఎత్తున పర్యటకులు సముద్ర తీరానికి తరలివచ్చారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు చేపట్టారు. సముద్రం లోపలికి వెళ్లకుండా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
సముద్రంలో కేరింతలతో పర్యటకులు
నూతనంగా జిల్లా ఏర్పడిన తర్వాత సూర్యలంక తీరంతో పాటు చీరాల వేటపాలెం సముద్ర తీరాలకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా.. హైదరాబాదు నుంచి పర్యటకులు తరలి వస్తున్నారు. వారాంతంలో ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానికులంటున్నారు. సముద్ర తీరం పరిశుభ్రంగా ఉంచాలని, తగినన్ని మరుగుదొడ్లు, స్నానాల గదులు నిర్మించాలని పర్యటకులు కోరుతున్నారు. ముఖ్యంగా మహిళలు దుస్తులు మార్చుకునేందుకు గదులు నిర్మిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: