ROAD ACCIDENT : 16వ నెంబర్ జాతీయ రహదారిపై రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన బాపట్ల జిల్లాలో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్టూరు మండలం రాజుపాలెం గ్రామానికి చెందిన టి.ఇశ్రాయేలు (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. రాత్రి డేగరమూడి - రాజుపాలెం కూడలిలో రోడ్డును దాటుతుండగా ఒంగోలు నుంచి చిలకలూరిపేటకు ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇశ్రాయేలు అక్కడిక్కక్కడే మరణించాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు.
బాపట్లలో గుర్తుతెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి.. రోడ్డుపై బంధువుల ఆందోళన
ROAD ACCIDENT IN BAPATLA: బాపట్ల జిల్లాలోని 16వ నెంబర్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీ కొని వ్యక్తి మృతి చెందాడు. డేగరమూడి - రాజుపాలెం కూడలిలో రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది. అండర్‌పాస్ నిర్మించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోడ్డుపై బైఠాయించి గ్రామస్థుల నిరసన: ఇశ్రాయేలు మృతి చెందాడని తెలుసుకున్న రాజుపాలెం, డేగరమూడి గ్రామస్థులు, మార్టూరు ప్రాంత ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్ద ఎత్తున హైవేపై ధర్నాకు దిగారు. దీంతో గంట పాటు చెన్నై - కోల్కత్తా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆందోళనకు దిగిన ప్రజలతో పోలీసులు చర్చలు జరిపారు. హైవేపై అండర్ పాస్ నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇటీవల ఎక్కువగా ప్రమాదాలు సంభవించి ప్రాణ నష్టం జరుగుతున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాపట్ల డీఎస్పీ హైవే అధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించేలా హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విమరించారు. అనంతరం మార్టూరు సీఐ , ఎస్సై రవీంద్రారెడ్డి, పర్చూరు ఎస్సై చౌదరి, సిబ్బంది కలిసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
ఇవీ చదవండి: