Bapatla District Crime News: బాపట్ల మండలంలో మైనర్ బాలికపై నంద అనే యువకుడు అత్యాచారానికి యత్నించాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. గ్రామ పెద్దలు కొందరు కేసు లేకుండా రాజీ ప్రయత్నాలు ప్రారంభించారు. దీంతో పోలీసులు కూడా తదుపరి చర్యలు చేపట్టలేదు. ఫలింతగా బాలిక తల్లిదండ్రులు.. ఐసీడీఎస్ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినా.. పోలీసుల నుంచి సరైన స్పందన లేదని బాలిక బంధువులు ఆరోపించారు.
బాపట్లలో బాలికపై అత్యాచారయత్నం.. ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న బాధితులు - Rape Attempt On Girl at Bapatla District
Rape Attempt On Girl at Bapatla District: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటన మరవకముందే బాపట్ల జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. బాపట్ల మండలంలో బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. ఫిర్యాదు చేసినా.. పోలీసులు పట్టించుకోవడంలేదని బాలిక బంధువులు ఆరోపించారు.
బాపట్ల జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం
బాధితుల ఫిర్యాదు మేరకు.. ఐసీడీఎస్ పీడీ లావణ్య క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులతో మాట్లాడారు. యువకుడు అత్యాచారానికి యత్నించింది నిజమేనని ఐసీడీఎస్ పీడీ తేల్చారు. నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని.. ప్రభుత్వం తరఫున అండగా నిలుస్తామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు.