Special Story On Poor Student in Bapatla : పేదింటి చదువుల తల్లి.. Poor Student got PHd Seat in Bangalore University : ప్రతికూల పరిస్థితులు ఎప్పుడూ విజయాలకు అవరోధాలు కావు అని నిరూపించింది నవీన. కష్టాలు మనసులో పెట్టుకుంటే జీవితం అక్కడితో ఆగిపోతుంది.. కానీ ఆ అమ్మాయి తన ప్రతికూలతలు లక్ష్య సాధనకు అవరోధాలు కాలేదంటుంది. మారు మూల పల్లెలో, కూలి ఇంట్లో పుట్టిన ఆమెకు అందిరిలా ఊళ్లో ఉన్న పాఠశాలలో అడుగుపెట్టింది. బంధువుల సలహాతో ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించారు తన తండ్రి. అక్కడ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటునే చదువుకుంటూ ప్రస్తుతం పీజీ పట్టా అందుకుంది. ఒకప్పుడు తెలుగు అంటేనే భయపడే ఆమె.. ఆ భాషపైనే పట్టు సాధించి పసిడి ఒడిసిపట్టింది.. పీహెచ్డీ చేసి భాషను కాపాడేందుకు కృషి చేస్తానంటుంది.
పార్వతీపురం టు జపాన్... వయా జడ్పీ స్కూల్
బాపట్ల జిల్లా అద్దంకి మండలం శివారు గ్రామం పేరాయిపాలెం ఊరికి రహదారి మార్గం కూడా సరిగ్గా లేదు. ఈ పల్లె ఓ యువతి కర్ణాటక బెంగళూరు విశ్వవిద్యాయంలో పోస్టు గ్రాడ్యూయేషన్‌లో పట్టా సాధించింది. పరిశోధన చేసేందుకు సీటుకూడా దక్కించుకుంది. చిన్న గ్రామం నుంచి విశ్వవిద్యాయంలో డాక్టరేట్ చేసే స్థాయికి ఎదిగింది ఓ సాధారణమైన , పేదంటి యువతి. ఆమె సాధించిన విజయం వెనుక అనేక కష్టాలు కూడా వెంటాడుతూ వచ్చాయి.
వీరాంజనేయలుకు నవీన, శ్రీకాంత్ బిడ్డలు... నిరక్షరాస్యుడైన ఇతను కూలి పని, పశుపోషణతో జీవనం సాగిస్తుండేవాడు. నవీన స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతిలో చేరింది. అ.. అమ్మ, ఆ.. అవు అని అక్షరాలు దిద్దే సమయానికే తల్లి మరణించింది. దీంతో కష్టాలు, బాధ్యతలు తోడయ్యాయి. తల్లిలేని పిల్ల కావడం వల్ల ఇంటి వద్ద పనీ పాటా అంటూ చదువును నిర్లక్ష్యం చేయాల్సి వస్తుందని తండ్రి తాళ్లూరులో ఉన్న ప్రభుత్వ వసతి గృహంలో చేర్పించాడు.
ఈటీవీ భారత్ కథనంతో.. తీరిన కష్టం!
'తండ్రి కూలీ నాలీ చేసి మమ్మల్ని చదివించాడు. ఊరిలోని జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో చదువుకున్నాను. పదో తరగత వరకూ అక్కడే సాగింది. పదోతరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణలయినా, తెలుగుభాషమీద అంత ఆసక్తి ఉండేది కాదు. అక్షర దోషాలు, వ్యాకరణ లోపాలతో ఇబ్బంది పడేదాన్ని. ఇంటర్‌లో ఏ గ్రూప్ తీసుకోవాలి? ఆర్థిక ఇబ్బందులు ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తున్న సమయంలో మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సహకారంతో నాగులప్పలపాడు తిమ్మసముద్రంలో ఓరియంటల్ తెలుగు భాషా కళాశాలలో ధరఖాస్తు చేసుకున్నాను. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీలో చేరాను. తిమ్మసముద్రంలో తెలుగుభాష మీద మక్కువ ఏర్పడింది. భాష తియ్యదనం తెలిసింది. డిగ్రీ తరువాత రాజమండ్రిలో ఉన్న ప్రభుత్వ తెలుగు పండిట్ శిక్షణా సంస్థలో సీటు దక్కించుకున్నాను. శిక్షణ పూర్తయితే ఉపాధ్యాయురాలిగా అవకాశం లభిస్తుందని భావించాను. ఉపాధ్యాయ శిక్షణ పూర్తయి, డీఎస్సీకి సన్నద్దం అయినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల పీజీ బాట పట్టాను.' -నవీన
'తల్లి లేకపోయినా, ఒక వైపు ఇంటి వద్ద బాధ్యతలు నిర్వర్తిస్తూ, రెండో వైపు చదువుకొని ఈ స్థాయికి వచ్చింది. తనను చూసి నాకెంతో గర్వంగా ఉంది.సెలవుల్లో ఇంటికి వచ్చినా నవీన ఖాళీగా ఉండేది కాదు. నాతో పాటు కూలిపనులు కూడా చేసేది.'-వీరాంజనేయులు, నవీన తండ్రి
Poor Student Got PHD Seat in Bangalore University : సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాసినప్పటికీ ఒక్క ర్యాంక్‌లో సీటు కోల్పోయింది.. అయితే కర్ణాటకలో బెంగళూరు విశ్వవిద్యాలయం కు ధరఖాస్తు చేసుకుంటే, మెరిట్ మీద ఎంఏ తెలుగులో సీటు లభించింది... అక్కడ తన కోర్సును ఇష్టంగా, లోతుగా చదవి పూర్తి చేసుకోవడమే కాదు.. బంగారు పతకం కూడా సాధించింది... ఇటీవల జరిగిన స్నాతకోత్సవంలో మాజీ ప్రధాని హెచ్ డి దేవేగౌడ చేతులు మీదుగా అవార్డు అందుకుంది.
ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్యనందించాలి: ఛాన్స్లర్
విజయవంతంగా పీజీ పూర్తి చేసిన నవీన అక్కడితో ఆగకుండా తెలుగు భాషపై పరిశోధన చేయాలని భావించింది. ఇదే యూనివర్సిటీలో పీహెచ్‌డి చేసేందుకు అడ్మిషన్ పొందింది. త్వరలో తెలుగుభాషపై ఒక అంశాన్ని ఎంపిక చేసుకొని, ప్రొఫెసర్ ఆశాజ్యోతి దగ్గర పీహెచ్‌డి చేస్తానని నవీన పేర్కొంది. నేటి తరం మాతృ భాష విలువ అర్థం చేసుకోలేకపోతున్నారు.. భావితరాలకు తెలుగుభాషలో తియ్యదనాన్ని తెలియజెప్పేందుకు తనవంతు కృషిచేస్తానని అంటుంది నవీన. మాతృభాషకు జీవం తీసుకురావడానికి తన వంత కృషిచేస్తానని నవీన అంటుంది.