Lovers suicide: బాపట్లజిల్లా చినగంజాం మండలంలో ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. చినగంజాం మండలం మున్నంవారిపాలేనికి చెందిన అట్ల సుబ్బారెడ్డి(25), అక్కల తేజ(17) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లుగా స్థానికులు తెలిపారు. ఈనేపథ్యంలో పెద్దలు వారి పెళ్లికి అంగీకరించకపోవడంతో మనస్తాపంతో ఇద్దరు ద్విచక్రవాహనంపై వెళ్లి, చినగంజాం మండలం అడవీధిపాలెం సమీపంలోని రొయ్యల చెరువుల వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు పేర్కొన్నారు. వివరాలు సేకరించి మృతుల కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం అందించారు.
పెద్దలు ఒప్పుకోలేదని ప్రాణాలు వదిలిన ప్రేమికులు - బాపట్ల క్రైమ్ న్యూస్
Lovers suicide: ప్రేమించి పెళ్లి చేసుకుని సంతోషంగా ఉందామనుకున్న ఓ యువ జంట ఆత్మహత్య చేసుకుంది. వారి ప్రేమను పెద్దలు అంగీకరించకపోగా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలింది. ఈ ఘటన బాపట్లజిల్లా చినగంజాం మండలంలో చోటుచేసుకుంది.
LOVERS SUSIDE