Car accident: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఊహించని ప్రమాదం జరిగింది. కొరిశపాడు గ్రామం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కారు బోల్తా పడటంతో వాహనంలో ఉన్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగిలిచర్ల నుండి విజయవాడ వెళుతుండగా కొరిశపాడు వద్దకు వచ్చేసరికి కారు టైరు పంక్చరై ఒక్కసారిగా బోల్తా పడింది.
టైర్ పంక్షరై కారు బోల్తా.. ఇద్దరికి గాయాలు - A car overturned on National Highway No 16
Car accident: బాపట్ల జిల్లా కొరిశపాడు మండలంలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. కొరిశపాడు గ్రామం వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై కారు బోల్తా కొట్టడంతో వాహనంలో ఉన్న ఇరువురికి స్వల్ప గాయాలయ్యాయి.
Car accident
కారులో ప్రయాణిస్తున్న కోటిరెడ్డి, వెంకటేశ్వర్లు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బోల్తా పడిన కారులో నుంచి కొద్దిసేపటి తరువాత మంటలు వ్యాపించాయి. గమనించిన స్థానికులు ఆ మంటలను ఆర్పివేశారు. అదే మార్గంలో గుంటూరు వైపు వెళుతున్న ప్రభుత్వ సలహాదారు నాగిరెడ్డి ఘటనా స్థలం వద్ద ఆగి.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు.
ఇవీ చదవండి: