Boy Dies after Slipping in Koneru at Ramakuru :బాపట్ల జిల్లా జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని శివాలయం కొనేరులో ఓ బాలుడి మృత దేహన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని పరిశీలించి ప్రమాదశాత్తు జరిగిన ఘటనగా భావించి మృతి చెందిన బాలుడి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పొందుపరిచారు. దీంతో విషయం తెలుసుకున్న బాలుడి కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించి జరిగిన తీరుని ఎస్సై తిరుపతిరావుకి వివరించారు.
అసలేం జరిగిందంటే.. ఎస్సై తిరుపతిరావు మాటల్లో:బాపట్ల జిల్లా చీరాల పట్టణానికి చెందిన దామర్ల రామకృష్ణ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మదీన శిల్క్స్ వస్త్ర దుకాణంలో సేల్స్ మాన్గా పని చేస్తుంటారు. తన కుమారుడు, కుమార్తెలతో కలసి శనివారం జిల్లాలోని జె.పంగులూరు మండలం రామకూరు గ్రామంలోని రామలింగేశ్వర స్వామి ఆలయానికి దైవ దర్శనం కోసం, ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వచ్చారు. రామకృష్ణ ప్రతి సంవత్సరం ఈ మాసంలో ఈ ఆలయానికి కుటుంబ సభ్యులతో కలిసి వస్తుంటాడు. అయితే తన భార్యకు హృదయ సమస్య ఉండటంతో ఆమెని తీసుకురాలేదు.
Girl sense of timing: మృత్యువునే భయపెట్టిందిగా..! ఆ బాలిక సమయస్ఫూర్తికి ప్రతి ఒక్కరూ సెల్యూట్
వీరు వచ్చిన సమయానికి ఆలయం వెనుక భాగంలో ఉన్న కోనేరు కొందరు యువకులు ఈత కొడుతున్నారు. వారిని చూసి తాను కూడా ఈత కొడతానని తండ్రిని అడగడంతో సరే అని ఈ అక్కడ ఉన్న వారికి పరిచయం చేసి జాగ్రత్తలు చెప్పి తన కూతురుతో పక్కన కూర్చున్నారు. కోనేరులో స్నానం ముగించుకొని బాలుడు సాయి అఖిల్(10) అందరితో తిరిగి వచ్చారు. తరువాత తన కుమార్తె కోనేరులో కాళ్లూ చేతులు కడుగుకొని వస్తానని అడగటంతో తండ్రి రామకృష్ణ కుమార్తెని తీసుకొని కోనేరు వద్దకు వెళ్లాడు. అప్పటికే స్నానం చేసిన కుమారుడిని అక్కడ ఉండమని చెప్పాడు.