ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am

.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

9am topnews
ప్రధానవార్తలు9am

By

Published : Dec 19, 2022, 9:04 AM IST

  • '27 పథకాల్ని రద్దు చేసిన వైకాపాకు బుద్ధి చెబుదాం..'
    ఎస్సీ, ఎస్టీల మద్దతుతో గద్దెనెక్కిన సీఎం జగన్‌.. అధికారం చేపట్టగానే 27 పథకాల్ని రద్దు చేసి.. వారిని వెన్నుపోటు పొడిచారని.. ఆ వర్గానికి చెందిన ఐకాస నేతలు ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేస్తే మాట వినరనే రాజకీయ కుతంత్రంలో భాగంగానే వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌ను ఎస్సీ, ఎస్టీలు కంకణం కట్టుకుని ముఖ్యమంత్రిని చేస్తే.. ఇప్పుడు వారినే ఊచకోత కోస్తున్నారని దుయ్యబట్టారు. చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ, ప్రధానీ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీల మీదే ఎట్రాసిటీ కేసులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో జగన్‌ను సీఎం పదవి నుంచి దించకపోతే రాష్ట్రంలో సామాజిక న్యాయం మంటగలిసిపోతుందన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కేంద్ర నిధులు "దారి" మళ్లించారు..మరి రహదారులు ఎప్పడు వేస్తారో..
    గ్రామీణ రహదారులపై మోకాళ్ల లోతు పడిన గుంతలను పూడ్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తట్టెడు మట్టిపోయడం లేదు. గతుకుల రోడ్లతో ప్రజలు నానా అగచాట్లు పడుతున్నా ఎవరికీ పట్టడం లేదు. మరోవైపు ప్రధాన మంత్రి గ్రామీణ సడక్‌ యోజన కింద గ్రామీణ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులను కూడా రాష్ట్రం విడుదల చేయడం లేదు. వీటిని సొంత అవసరాలకు మళ్లిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గ్రూప్​ ఇన్స్యూరెన్స్​ ప్రీమియం తీసుకుంటున్నా బాండ్లు ఇవ్వని ప్రభుత్వం
    గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు రెండేళ్ల సర్వీస్‌ పూర్తి చేశాక వారి ప్రొబేషన్‌ను జులైలో ఖరారు చేసారు.. అప్పటి నుంచి వారి జీతం నుంచి జీవిత బీమా కింద నెలకు 850 రూపాయలు చొప్పున మినహాయించుకుంటున్నారు కాని బాండ్లు మాత్రం జారీ చేయడంలేదు. ఏదైనా ప్రమాదం జరిగితే తమ పరిస్థితి ఏమిటని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ చూపాలని ఏపీ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భాజపా, తెలుగుదేశం పార్టీలకు అమ్ముడుపోయే ఖర్మ నాకు లేదు : పవన్‌ కల్యాణ్‌
    వైకాపా సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ ఏకం చేసి కొత్త ప్రభుత్వం స్థాపించడమే తన లక్ష్యమని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ తేల్చిచెప్పారు. రాబోయే ఎన్నికల్లో వైకాపా అధికారంలోకి రాదని ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో వైకాపా మరింతగా విధ్వంసం సృష్టించనుందన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావాలని.. జనసైనికులకు పవన్‌ పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • లవర్​తో పెళ్లికి నో చెప్పిన పెద్దలు ట్యాంక్​ ఎక్కి మైనర్​ రచ్చరచ్చ
    ప్రియుడితో పెళ్లికి నో అన్నారని నీటి ట్యాంక్ ఎక్కింది ఓ యువతి. వివాహానికి ఓకే చెప్పేంత వరకు కిందకు దిగనని మారం చేసింది. సమయానికి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పెద్దలను ఒప్పించి వారి పెళ్లి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీసుల మాటలు విన్న ఆ యువతి ఎట్టకేలకు ట్యాంక్ దిగి కిందకు వచ్చింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో జరిగింది. అయితే మూడు నెలలుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్​ 8న పరారైంది. అలా ముంబయిలో తల దాచుకున్న ఆ ఇద్దరి విషయం కుటుంబసభ్యులకు తెలియగా డిసెంబర్​ 16న ప్రతాప్​గఢ్​కు వారిని తిరిగి తీసుకొచ్చారు. పెళ్లికి అబ్బాయి తరఫు వారు నిరాకరించడం వల్ల యువతి ట్యాంక్​ ఎక్కింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అణువంత దీపం.. కొండంత వెలుగు.. అమెరికా శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
    ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన భూతాపం, ఇంధన కొరతకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా మానవాళి అడుగులేస్తోంది. అమెరికా శాస్త్రవేత్తలు చేసిన కృషితో.. నక్షత్రాలకు వెలుగును ప్రసాదించే న్యూక్లియర్​ ఫ్యూజన్​ చర్య భూమిపై సాధ్యపడింది. అయితే దీన్ని అందుబాటులోకి వస్తే అతి తక్కువ ఖర్చుతో మానవాళికి సంబంధించిన ఎన్నో అవసరాలను తీర్చుకోవచ్చు. అసలు న్యూక్లియర్​ ఫ్యూజన్​ అంటే ఏంటో తెలుసుకుందాం! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 26 శాతం పెరిగిన స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు.. రూ.13.63 లక్షల కోట్ల ఆదాయం..
    గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోల్చితే.. ఈ ఏడాది స్ధూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 26 శాతం మేర పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతానికి ఈ వసూళ్లు రూ. 13.63 కోట్లుకు చేరినట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇవి 80 శాతానికి సమానమని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ట్రూకాలర్‌ కొత్త ప్లాన్.. ఫ్యామిలీ మొత్తానికి ఒకటే సబ్‌స్క్రిప్షన్‌
    స్పామ్‌, స్కామ్‌ కాల్స్‌ ద్వారా జరిగే మోసాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ట్రూకాలర్‌ మరో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో యూజర్లు యాడ్‌-ఫ్రీ సేవలను పొందడమే కాకుండా.. అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ చెబుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అందలమెక్కిన అందరివాడు.. అచ్చం సచిన్‌ లాగే!
    సచిన్‌ వన్డే ప్రపంచకప్‌ గెలవకుండా కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఉంటే..?ఫెదరర్‌ ఏదో ఒక గ్రాండ్‌స్లామ్‌ అందుకోకుండా వీడ్కోలు తీసుకుని ఉంటే..? వారి కెరీర్‌ పరిపూర్ణం అయ్యేదా..? ఏదో వెలితిగా అనిపించేది కదా..? లియొనెల్‌ మెస్సి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను అందుకోకున్నా అంతే..! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పాన్ ​ఇండియా పోరు తెలుగు సినిమా జోరు.. ఈ ఏడాది అదరగొట్టిన చిత్రాలివే!
    ప్రస్తుతం పాన్‌ ఇండియా హవా నడుస్తోంది. తెలుగు, తమిళ, హిందీ, కన్నడం.. ఇలా ప్రతి భాషలోనూ పాన్‌ ఇండియా చిత్రాలు రెడీ అవుతున్నాయి. అందులో ఎక్కువగా తెలుగు చిత్రాల ఆధిపత్యమే బలంగా కనిపిస్తోంది. మరి ఈ ఏడాది పాన్‌ ఇండియా స్థాయిలో మెరిసిన ఆ తెలుగు చిత్రాలేవి? వాటి విశేషాలేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details