బాపట్ల జిల్లా ఇంకొల్లు మండలం ఇడుపులపాడులో విషాదం చోటుచేసుకుంది. సైనిక ఉద్యోగం రాదనే మనస్తాపంతో గోపిదేశి మణికంఠ అనే 20ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్మీలో చేరాలనే పట్టుదలతో శిక్షణ తీసుకుని పరుగు పందెం, మెడికిల్ పరీక్షలో పాసయ్యడాని కుటుంబ సభ్యులు తెలిపారు. అక్టోబర్ నెలలో రాత పరీక్షకు సిద్ధమవుతున్న మణికంఠ.. ఆ పరీక్ష ఆగిపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. అగ్నిపథ్ నిబంధనల కారణంగా ఉద్యోగం రాదనే దిగులుతో.. ఉరివేసుకున్నాడని తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్మీలో ఉద్యోగం రాదని.. యువకుడు ఆత్మహత్య!
సైనికులంటే ఆ యువకుడి ప్రాణం. ఎలాగైనా తానూ ఓ సైనికుడిని కావాలనుకున్నాడు. అందుకోసం ఎంతో శ్రమించాడు. ఆర్మీలో చేరాలని పట్టుదలతో శిక్షణ సైతం తీసుకున్నాడు. ఆర్మీ నియామక ర్యాలీలో పాల్గొని పరుగు పందెం, మెడికల్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. ఇంకా రాత పరీక్షకు సిద్ధమయ్యాడు. ఇప్పటిదాకా అంతా సజావుగానే జరిగింది. కానీ.. అంతలోనే రాత పరీక్ష ఆగిపోవటం, అగ్నిపథ్ రావడంతో.. తనకు ఆర్మీ ఉద్యోగం రాదని మనస్థాపంతో అత్మహత్యకు పాల్పడ్డాడు!
suicide