ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుణ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

Loan app harassment ఆన్​లైన్ రుణయాప్ నిర్వహకుల వేధింపులకు మరో ప్రాణం బలైంది. తీసుకున్న అప్పు చెల్లించాలని యాప్ నిర్వహకులు ఇబ్బందులకు గురి చేయటంతో అన్నమయ్య జిల్లాలో ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

రుణ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య
రుణ యాప్ వేధింపులు తట్టుకోలేక యువకుడి ఆత్మహత్య

By

Published : Aug 25, 2022, 9:33 PM IST

Online loan app harassment: అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మేడికుర్తిలో విషాదం చోటు చేసుకుంది. ఆన్​లైన్ ద్వారా తీసుకున్న రుణం చెల్లించాలని రుణ యాప్ నిర్వహకుల వేధింపులు, స్థానికంగా అప్పులు ఎక్కువ కావటంతో మనస్థాపం చెంది ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన యశ్వంత్ కుమార్ (23) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరి ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాడు.

కరోనా సమయంలో తండ్రి మృతి చెందటంతో పాటు వ్యాపారం కోసం ఆన్​లైన్​ యాప్​ల ద్వారా రుణం తీసుకున్నాడు. అప్పు తీర్చకపోవటంతో లోన్ యాప్​ నిర్వహకుల నుంచి తీవ్ర వేధింపులు ఎదురయ్యాయి. దీంతో మానసికంగా కుంగిపోయిన యశ్వంత్.. ఇంట్లో ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ యాప్ నిర్వహకుల నుంచి వేధింపులు ఎక్కువైనట్లు పది రోజుల కిందటే యశ్వంత్ పోలీసులను ఆశ్రయించాడు. ఇంతలోనే అతడు బలవన్మరణం చెందటంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇవీ చూడండి

ABOUT THE AUTHOR

...view details