గుర్రం పందేలు, ఎడ్ల పందేలు, కొడి పందేలు మీరు చూసే ఉంటారు. ఇందులో కొత్త ఏం ఉంటుందన్నది మీ ప్రశ్నే అయితే.. దానికి సమాధానం పందుల పందేలు. వినటానికి వింతగా ఉన్నా.. మీరు చదువుతోంది నిజమే. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలు చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి..ఆసక్తిగా తిలకించారు.
PIG COMPETITIONS : పందుల పందేలు.. ఎక్కడో తెలుసా.. - PIG COMPETITIONS IN ANNAMAYYA DISTRICT
సాధారణంగా కోడి పందేలు, ఎద్దులు బండ లాగే పోటీలు అందరూ చూసి ఉంటారు. అక్కడక్కడ పొట్టెళ్ల పోటీలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ అందుకు భిన్నంగా.. పందులు పోటీలను నిర్వహించడం ఎప్పుడైనా విన్నారా? ఎక్కడైనా చుశారా? అది ఎక్కడో చూడాలని ఆసక్తిగా ఉందా? అయితే ఓ లుక్కెయ్యండి.
అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి మండల పరిధిలోని దిగువ అబ్బవరం గ్రామంలో గురువారం పందుల పోటీలు నిర్వహించారు.రూ.లక్షల్లో పందెం కాశారు. ముందుగా రెండు బలమైన పందులను చదునైన ఖాళీ ప్రదేశంలో పోటీకి దించారు. వీటి మధ్య జరిగిన పోరాటంలో పారిపోకుండా ఎక్కువ సేపు పోరాడే పందిని విజేత ప్రకటిస్తారు. ఈ దృశ్యాలను సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. పోటీలు నిర్వహించిన పందులు యజమానులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సహజంగానే రెండు పందులు పోరాటానికి దిగాయని.. తాము ఎలాంటి పోటీలు నిర్వహించి లేదని పందుల యజమానులు వాపోయారు.