ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Accident: అన్నమయ్య జిల్లాలో లారీ, ఆటో ఢీ.. ఐదుగురు మృతి - కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం

ACCIDENT: లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన ఘటన అన్నమయ్య జిల్లా రైల్వే కమ్మపల్లి క్రాస్​ రోడ్డు వద్ద చోటుచేసుకుంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులతో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

By

Published : Jul 23, 2022, 9:03 PM IST

Updated : Jul 24, 2022, 8:54 AM IST

ACCIDENT: ఆ దంపతులు కులాంతర వివాహం చేసుకున్నారు. ఎనిమిదేళ్ల కుమార్తెతో పాటు 3 నెలల క్రితమే పుట్టిన కుమారుడితో సంతోషంగా ఉన్నారు. కానీ విధి వక్రించింది. కుమారుడికి అన్నప్రాశన చేసుకుని తిరిగి వస్తుండగా జరిగిన ఆటో ప్రమాదం.. ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన ప్రొద్దుటూరు కృష్ణారెడ్డి, పెంచలమ్మకు సాయి (8) అనే కుమార్తె, కుమారుడు (3 నెలలు) ఉన్నారు. పెంచలమ్మ తన కుమార్తె, కుమారుడిని తీసుకుని ఆటోలో ఓబులవారిపల్లెలోని పుట్టింటికి కుమారుడి అన్నప్రాశన కోసం వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు పెంచలమ్మ, ఆమె, పిల్లలతోపాటు.. తల్లి ఆకుల పెద్ద వెంకటసుబ్బమ్మ, పొరుగింట్లో ఉండే వెంకట తులసమ్మ ఆటోలో రైల్వేకోడూరు బయల్దేరారు. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరి ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పెంచలమ్మ కుమార్తె సాయి, కుమారుడు, తల్లి వెంకటసుబ్బమ్మ (55), వెంకట తులసమ్మ (34) అక్కడికక్కడే మరణించారు. ఆటోడ్రైవరు బాలకృష్ణ (34), పెంచలమ్మకు (30) తీవ్రగాయాలు కావడంతో వారిని 108లో తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పెంచలమ్మ మృతి చెందారు. భార్యాపిల్లల మృతి విషయం తెలిసి ఆమె భర్త గుండెలవిసేలా రోదించారు.

కర్నూలులో ఇద్దరు మృతి: కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరిడికొండ వద్ద మరో రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. మృతులు కప్పట్రాళ్లకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు.

ఇవీ చూడండి

Last Updated : Jul 24, 2022, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details