ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కడుపు నిండి'నోళ్లకేం' తెలుసు కరవు కష్టం - కొద్దిపాటిదే అన్నట్లుగా జగన్​ తీరు - కరవు మండలాల్లో రైతు సమస్యలపై జగన్ నిర్లక్ష్యం

YSRCP Government Did Not Review On Drought Zones in AP: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావం వల్ల ఖరీఫ్‌లో సుమారు 30 లక్షల ఎకరాలు విత్తుకునోచుకోలేదు. 400కుపైగా మండలాల్లో తీవ్ర దుర్భిక్షం కారణంగా పంటలు పండే పరిస్థితి లేదు. వేరుశనగ, వరి, కంది, పత్తి దిగుబడులు భారీగా తగ్గనున్నాయి. దాదాపు 30 వేల కోట్ల రూపాయలకు పైగానే ఉత్పత్తి నష్టం ఉన్నా సీఎం జగన్‌ మాత్రం ఇది కొద్దిపాటి కరవే అన్నట్లుగా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

YSRCP_Government_Did_Not_Review_On_Drought_Zones_in_AP
YSRCP_Government_Did_Not_Review_On_Drought_Zones_in_AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 12, 2023, 7:51 AM IST

కడుపు నిండి'నోళ్లకేం' తెలుసు కరవు కష్టం!-దుర్భిక్షం వెంటాడుతున్నా సమీక్షలూ లేవు

YSRCP Government Did Not Review On Drought Zones in AP :ఈ ఏడాది ఖరీఫ్‌లో 400 పైగా మండలాల్లో దుర్భిక్షం నెలకొంది. కానీ కేవలం 103 మండలాల్లోనే కరవు ఉందని ప్రభుత్వం చేతులు దులుపుకుంది. రెండో విడత కరవు మండలాల ప్రకటన (Drought Zones Declaration) ఆలోచనే లేదు. రబీలోనూ కరవు వెంటాడుతున్నా, లక్షల ఎకరాల్లో పంటలు వేయకపోయినా ముందస్తు కరవు ప్రకటన ఊసే లేదు. కేంద్ర బృందాన్ని ఆహ్వానించి పంట నష్టాన్ని (Crop Loss) చూపిద్దామనే ఆసక్తీ లేదు. కరవు లేదని బుకాయించడం, కాదంటే కాస్త కరవే అన్నట్లుగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వ్యవహరిస్తున్నారు. ఒక్కో రైతు కుటుంబానికి 13,500 రూపాయలు ఇస్తున్నాం కరవుతో వాళ్లు నష్టపోయేదేముంది. పెట్టుబడి మేమిచ్చిందే కదా అన్నట్లుగా ఆయన ధోరణి కనిపిస్తోంది.

CM Jagan Careless on Drought Zones in Andhra Pradesh :కడుపు నిండినోళ్లకు రైతుల కరవు కష్టం ఏం తెలుస్తుంది..అన్నట్లుంది రాష్ట్రంలో పరిస్థితి. యథారాజా అన్నట్లు అధికారులు కరవు నివేదికల తయారీని వదిలేశారు. రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యాన, ప్రణాళికా శాఖలన్నీ మౌనం పాటిస్తున్నాయి. ఖరీఫ్‌లో సుమారు 30 లక్షల ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం తగ్గినా ప్రభుత్వం పట్టనట్లుగా వ్యవహరిస్తోంది.

'జగన్ ప్రభుత్వానికి రైతులను పట్టించుకునే తీరిక లేదు - 361 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించాలి'

Andhra Pradesh Farmer Problems :వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలం సి.గోపాలపురం గ్రామానికి చెందిన రైతు ఐదు ఎకరాల్లో మినుము వేశాడు. ఎకరాకు 40 వేల రూపాయలు ఖర్చు చేశాడు. అయితే వానల్లేక పంటలు ఎండిపోతుండటంతో దున్నేశాడు. ఈ నెల 9, 10వ తేదీల్లో రెండు రోజుల పాటు.. సొంత జిల్లాలో ఉన్న సీఎం జగన్‌కు ఎండుతున్న పొలం పరిశీలిద్దామనే ఆలోచనే లేదు.

చేతులెత్తేసిన ప్రభుత్వం : ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుర్భిక్షం నెలకొన్నా కేవలం 49 మండలాలనే కరవు ప్రాంతంగా ప్రభుత్వం ప్రకటించింది. అన్ని విధాలా పంటలు నష్టపోయినా పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కరవు పరిస్థితులపై సీఎం అవాస్తవాలు మాని పొలం బాట పట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Farmer Problems in Drought Zones :సాధారణం కంటే జూన్‌లో 31%, ఆగస్టులో 34% తక్కువ వానలు కురిసినా పంటల సాగు 30 లక్షల ఎకరాల మేర తగ్గినా ముందస్తు కరవు మండలాలను ప్రకటించలేదు. బీడు భూములు, ఎండిన పంటలు, ఉత్పత్తి నష్టం, పెట్టుబడి రాయితీపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు.కరవు తీవ్రతపై కేంద్రానికి నివేదికలు పంపిస్తే అక్కణ్నుంచి బృందాలు వచ్చి నష్టాన్ని అంచనా వేస్తాయి. కానీ ప్రభుత్వానికి అదేమీ పట్టడం లేదు.

Jagan Careless on Farmer Problems in Drought Zones :కరవుపై సమీక్షించడానికి కూడా ప్రభుత్వానికి తీరిక లేకపోయింది. మాకెందుకొచ్చిన గొడవ అని అధికారులు మిన్నకుంటున్నారు. నివేదికల రూపకల్పనలో అన్ని విభాగాలూ మొక్కుబడిగా వ్యవహరిస్తున్నాయి. నెలవారీగా పంటల స్థితిగతులు, కరవు పరిస్థితులపై నివేదికలు తయారు చేసే ప్రణాళికా విభాగం అయితే ఆ మాట ఎత్తడానికే భయపడుతోంది. అది మా పని కాదు, వ్యవసాయశాఖ వ్యవహారమని అధికారులే తప్పించుకుంటున్నారు.

'కడపను కరవు జిల్లాగా ప్రకటించకపోతే ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం'

ABOUT THE AUTHOR

...view details