YSRCP Factional War in Rayadurgam: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న వర్గపోరు ఒక్కొక్కటిగా రచ్చకెక్కుతున్నాయి. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషణలు చేసుకుంటున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన తోడల్లుడు హంపారెడ్డి వర్గాల మధ్య జరిగిన వర్గపోరు జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
రాయదుర్గంలో రచ్చకెక్కిన వైఎస్సార్సీపీ వర్గపోరు- నడిరోడ్డుపై పరస్పర దూషణలు జరిగిన సంఘటన ఇది: అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, ఆయన తోడల్లుడు హంపారెడ్డి వర్గాల నడుమ సామాజిక మాధ్యమాల్లో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఆ వ్యవహారం వైరల్‌గా మారడంతో అది కాస్తా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. కాపు రామచంద్రారెడ్డి భార్య భారతి, మంజుల అక్కాచెల్లెళ్లు. మంజుల భర్త హంపారెడ్డి కూడా వైఎస్సార్సీపీలోనే ఉన్నారు. వీరి కుటుంబానికి సీఎం జగన్ కుటుంబంతో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే, హంపారెడ్డి స్థానికంగా కాపు నాయకత్వాన్ని వ్యతిరేకించి, మెట్టు గోవింద రెడ్డికి అనుకూలంగా ఉన్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది.
YSRCP leaders clashes నడిరోడ్డుపై బాహాబాహీకి దిగిన అధికార పార్టీ నేతలు.. వీడియో వైరల్
Argument Between Manjula, Nagireddy: ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా రెండు కుటుంబాల మధ్య మాటలు లేవని తెలుస్తోంది. తాజాగా రాయదుర్గం టికెట్టు ఈసారి మెట్టు గోవింద రెడ్డికే వస్తుందంటూ కాపు తోడల్లుడైన హంపారెడ్డి స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ఓ పోస్టు పెట్టారు. దీనికి కౌంటర్‌గా హంపారెడ్డిని దూషిస్తూ కాపు ప్రధాన అనుచరుడు నాగిరెడ్డి సందేశం పోస్టు చేశారు. శుక్రవారం ఉదయం రాయదుర్గం పట్టణంలో హంపారెడ్డి భార్య మంజుల, కాపు అనుచరుడు నాగిరెడ్డికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. నాగిరెడ్డి తన పట్ల అసభ్యంగా మాట్లాడటంతో పాటు, అంతుచూస్తానంటూ బెదిరించాడని మంజుల పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగిరెడ్డి నుంచి తనకు, తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, పోలీసులు ఇప్పటివరకూ మంజుల ఫిర్యాదుపై కేసు నమోదు చేయలేదు.
కడప వైకాపాలో వర్గ పోరు...గాల్లోకి ఓ వర్గం నేత కాల్పులు
Hampareddy wife Manjula comments: హంపారెడ్డి సతీమణి మంజుల మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. ''ఈ గొడవ గత సంవత్సరం నుంచి జరుగుతూనే ఉంది. అయినా, మేము శాంతిగా ఉంటూ వచ్చాం. ఎందుకంటే మేము మేము గొడవ పడితే, పార్టీకి చెడ్డపేరు వస్తుందని మమ్మల్ని ఎన్ని మాటలన్నా సైలెంట్‌గా ఉన్నాం. అయితే, ఈరోజు నేను తోటలోకి వెళ్తుండగా నాగిరెడ్డి అడ్డుపడి, వ్యక్తిగతంగా నానా మాటలు అన్నారు. 'నిన్ను, నీ భర్తను కొడితే ఎవరూ అడ్డు వస్తారు' అంటూ నాగిరెడ్డి బెదిరింపులకు దిగారు. అతని వల్ల నాకు, నా కుటుంబానికి ప్రాణహాని ఉంది. పోలీసులు ఈ విషయంలో న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ నాగిరెడ్డిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను.'' అని ఆమె అన్నారు.
Anilkumar Vs Roopkumar: సీఎం రాజీ కుదిర్చినా.. ఆగని ఆరోపణలు, దాడులు