ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాలవ శ్రీనివాసులుపై దాడికి వైకాపా కార్యకర్తల యత్నం - ఆంధ్రా స్థానిక ఎన్నికలు న్యూస్

నామినేషన్ల తిరస్కరణను ప్రశ్నించేందుకు వచ్చిన తెదేపా నేత కాలవ శ్రీనివాసులుపై వైకాపా కార్యకర్తలు దాడికి యత్నించిన ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కాలవతోపాటు మున్సిపల్ కమిషనర్​పైనా దాడికి యత్నించారు.

కాలవ శ్రీనివాసులుపై దాడికి వైకాపా కార్యకర్తల యత్నం
కాలవ శ్రీనివాసులుపై దాడికి వైకాపా కార్యకర్తల యత్నం

By

Published : Mar 14, 2020, 10:37 PM IST

Updated : Mar 14, 2020, 11:33 PM IST

కాలవ శ్రీనివాసులుపై దాడికి వైకాపా కార్యకర్తల యత్నం

అనంతపురం జిల్లా రాయదుర్గం పురపాలికలో తెదేపాకు చెందిన ముగ్గురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ విషయంపై ప్రశ్నించేందుకు కాలవ శ్రీనివాసులు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లగా.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి సైతం తన అనుచరులతో అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా రెచ్చిపోయిన వైకాపా కార్యకర్తలు కాలవతో పాటు మున్సిపల్ కమిషనర్‌పైనా దాడికి యత్నించారు.

పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని కాలవను అక్కడి నుంచి తరలించారు. కళ్యాణదుర్గం తరలించే ప్రయత్నాలను తెదేపా శ్రేణులు ప్రతిఘటించగా ఇంటి వద్ద విడిచిపెట్టారు. కాపురామచంద్రారెడ్డి వీధి రౌడిలాగా వ్యవహరించారని కాలవ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో తమను హతమార్చడానికి వైకాపా నేతలకు ప్రత్యేక హక్కులు ఏమైనా ఇచ్చారా అని ప్రశ్నించారు.

Last Updated : Mar 14, 2020, 11:33 PM IST

ABOUT THE AUTHOR

...view details