అనంతపురం జిల్లా ఉరవకొండ అంబేడ్కర్ కాలనీలో పంచాయతీ కార్మికుడు రాజుపై వైకాపా వార్డు మెంబర్ భర్త దాడికి పాల్పడ్డారు. డ్రైనేజీ పనులు చేస్తుండగా తను చెప్పిన ప్రదేశంలో పని చేయాలంటూ లాల్ స్వామి ఆదేశించాడు. మేస్త్రీ చెప్పిన ప్రదేశంలో మాత్రమే పని చేస్తానన్న రాజు ఇతర ప్రాంతాల్లో వేరే కార్మికులు చేస్తారని బదులిచ్చాడు. దీంతో లాల్ స్వామి చేయి చేసుకుని రాళ్లపైకి తోయడం వల్ల కార్మికుడు రాజుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తోటి పంచాయతీ కార్మికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అనంతరం రాజును వారు ఆస్పత్రికి తరలించారు.
attack: కార్మికుడిపై దాడిచేసిన వైకాపా వార్డు మెంబర్ భర్త - అనంతపురం జిల్లా వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండ అంబేడ్కర్ కాలనీలో పంచాయతీ కార్మికుడిపై వైకాపా వార్డు మెంబర్ భర్త దాడి చేశాడు. పరస్పర ఘర్షణలో పంచాయతీ కార్మికుడు రాజుకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న తోటి పంచాయతీ కార్మికులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.
attack