ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైసీపీ నేత భూ బాగోతం - గుట్టలు తొలచి చదును చేసి ప్రభుత్వ భూమి విక్రయం

YCP Leaders Land Kabja In Anantapur District : రైతుల సాగు కోసం ఇచ్చిన 2.25 ఎకరాల ప్రభుత్వ భూమిని అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం కసాపురానికి చెందిన వైసీపీ నేత ఫ్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నాడు. ప్రభుత్వ భూమిలో గుట్టలను ఎందుకు చదును చేస్తున్నారంటూ కసాపురం గ్రామస్థులను అడ్డుకున్నారు. అదేమీ పట్టించుకోకుండా గుట్టలను తొలగించి, హద్దులు ఏర్పరిచి, కొంతమంది పేరిట ప్లాట్లుగా మార్చారు. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడానికి అధికారుల సైతం వెనకాడుతున్నారు.

ycp_leaders_land_kabja_in_anantapur_district
ycp_leaders_land_kabja_in_anantapur_district

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 25, 2023, 5:12 PM IST

రియలెస్టేట్ వ్యాపారులైన వైసీపీ నేతలు- అండగా అధికారులు

YCP Leaders Land Kabja in Anantapur District :గుట్టలను తొలగించి ఫ్లాట్లుగా మార్చి యథేచ్ఛగా విక్రయాలు చేస్తున్న వైసీపీ నేత.. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను అన్యక్రాంతం చేస్తున్నారని స్థానికులు వాపోతున్నారు. కళ్ల ముందే అధికార పార్టీ నాయకులు భూమిని స్వాహా చేస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్న వైనం అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు సైతం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Land Kabja In Guntakallu :అనంతపురం జిల్లా గుంతకల్లు మండల పరిధిలోని కసాపురం గ్రామపంచాయతీలో సర్వేనెంబర్ 447 ఏ లోని 2.25 ఎకరాలు భూమిని గతంలో సాగు కోసం వైసీపీకి చెందిన వ్యక్తి పేరిట పట్టా పంపిణీ చేశారు. పట్టా పొందిన వ్యక్తి, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి స్థలాన్ని కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్​ చేయించుకున్నారు. అనంతరం అసైన్డ్ భూమిలో గుట్టలను తొలగించి చదును చేసే కార్యక్రమం మొదలుపెట్టారు.

జిల్లాలో భూ దోపిడీ.. ?... వైకాపా నేతలే దోచుకుంటున్నారని ఆరోపణ

YCP Leaders Illegal Land Sellings : ఈ నేపథ్యంలో కసాపురం గ్రామస్థులు ప్రభుత్వ స్థలంలో గుట్టలను ఎందుకు తొలగిస్తున్నారు అంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడ్డుకున్నారు. ఇవేవీ పట్టించుకోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు గుట్టలను తొలగించి హద్దులను ఏర్పరిచి.. రాళ్లను పాతి కొంతమంది పేరిట క్రయవిక్రయాలు జరిపి ప్లాట్లుగా మార్చారు. ఈ తతంగమంతా రెవెన్యూ అధికారులకు తెలిసినప్పటికీ చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారు.

'మంత్రి బొత్స సోదరుడు మా ఇళ్ల స్థలాలు ఆక్రమించార

Cultivated Land Kabja :వైసీపీ నాయకులే రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మారి ప్లాట్లను విక్రయిస్తుండడంతో రెవెన్యూ అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవరిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై గుంతకల్లు తహశీల్దార్ ప్రతాప్ రెడ్డిను వివరణ కోరగా... గతంలో సాగు కోసం పట్టా మంజూరు చేసిన మాట వాస్తవమేన్నారు. సాగు కోసం ఇచ్చిన పట్టాల్లో పంట మాత్రమే సాగు చేసుకోవాలని.. ప్లాట్లు వేసి విక్రయించుకోవడానికి ఎవరికీ హక్కు లేదన్నారు.

'కబ్జా ఆపకుంటే.. కలెక్టర్​ను కలుస్తా'

YCP Real estate Bussiness In Anantapur : సాగు భూమిని ప్లాట్లుగా మార్చిన వారికి నోటీసులు అందజేయాలని గ్రామ రెవెన్యూ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు రాళ్లను తొలగించి చర్యలు చేపడతారా లేక ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతున్నా చూస్తూ ఊరుకుంటారా? అనే విషయం ప్రజల్లో చర్చనీయాంశమైంది.

భూమిని కాజేసేందుకు పక్కా ప్లాన్.. సినీఫక్కీలో కుట్ర!

"బడైనా.. గుడైనా.. డోంట్​ కేర్​.. మా కన్ను పడితే.."

ABOUT THE AUTHOR

...view details