ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'పంచాయతీ ఎన్నికల్లో తెదేపా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తోంది' - పంచాయతీ ఎన్నికలు తాజా వార్తలు

అనంతపురం జిల్లాలో తెదేపా నేత మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అశాంతి నెలకొల్పుతున్నట్లు.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్​ను తెదేపా ఎమ్మెల్సీ దొరబాబు ఉల్లంఘించి.. చిత్తూరులోని యాదమరిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడానికి కారకులయ్యారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు విమర్శించారు.

ycp leaders fires on tdp over panchayat elections
'పంచాయతీ ఎన్నికల్లో తెదేపా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది'

By

Published : Feb 1, 2021, 9:49 AM IST

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెదేపా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు.. ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు అశాంతి నెలకొల్పుతున్నట్లు ఆరోపించారు.

ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు

పంచాయతీ ఎన్నికల కోడ్​ను తెదేపా ఎమ్మెల్సీ దొరబాబు ఉల్లంఘించి.. చిత్తూరులోని యాదమరిలో ఘర్షణ వాతావరణం చోటుచేసుకోవడానికి కారకులయ్యారని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు అన్నారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే కారులో కర్రలు, అంగ రక్షకులతో దొరబాబు గ్రామాలలో తిరుగుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆయన వైఖరి కారణంగా వైకాపాకు చెందిన నలుగురు కార్యకర్తలు గాయపడ్డారని తెలిపారు. గతంలో ప్రత్యర్దులను నామినేషన్ వేయనీయకుండా.. ఎమ్మెల్సీగా గెలిచిన విషయం దొరబాబు మరిచారని విమర్శించారు.

ఇదీ చదవండి:

'ప్రశాంతతకు నెలవైన ఉత్తరాంధ్ర.. విధ్వంసాలకు వేదికవడం బాధాకరం'

ABOUT THE AUTHOR

...view details