అనంతపురం జిల్లా గోరంట్ల మండలంలోని తమ్మినాయనపల్లి గ్రామంలో వివాదాస్పదమైన 5 ఎకరాల 56 సెంట్ల భూమిని వైకాపా జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు నాగభూషణ్ రెడ్డి కొనుగోలు చేసి రాత్రికి రాత్రే మొక్కలు నాటాడు. 2015 నుంచి భూమిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు శనివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకొని మొక్కలు తొలగించారు. తాను కొనుగోలు చేసిన భూమిలో మొక్కలు నాటుకుంటే అధికారులు ఎలా తొలగిస్తారని నాగభూషణ్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సంఘటనపై కోర్టులో ప్రైవేట్ కేసు వేస్తానని రెవెన్యూ అధికారులను హెచ్చరించారు.
వివాదాస్పద భూమిలో రాత్రికి రాత్రే వైకాపా నేత మొక్కలు - ycp leader Land possession news
ఆ భూమిపై కోర్టులో కేసు కొనసాగుతోంది. అయినా వైకాపా నేత దానిని కొనుగోలు చేసి రాత్రి వేళ మొక్కలు నాటించారు. విషయం తెలుసుకుని మొక్కలు తొలగించేందుకు రెవెన్యూ అధికారులు రాగా... వారికి వైకాపా నేత హెచ్చరికలు జారీ చేశాడు.
land issue