వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత విమర్శించారు. అనంతపురం జిల్లాలో వైకాపా అరాచకాలపై జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ఉన్న ప్రాంతాల్లో సైతం వైకాపా నాయకులు అరాచకాలు సృష్టిస్తూ.. తెదేపా కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. కళ్యాణదుర్గంలో ఓ రైతుకు చెందిన 18 ఎకరాల దానిమ్మ తోటను ధ్వంసం చేయటాన్ని చూస్తేనే వారి రాక్షసత్వం ఏంటో అర్థమవుతుందన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించటం మంచిది కాదన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
'వైకాపా ప్రభుత్వానిది రాక్షస పాలన'
మాజీ మంత్రులు పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు వైకాపా ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రంలో కొనసాగుతున్నది రాక్షస పాలన అని మండిపడ్డారు. వారి పాలన ఇలాగే కొనసాగితే తెదేపా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
'వైకాపా ప్రభుత్వానిది రాక్షస పాలన'