ఉద్యోగి మృతి.... మృతదేహంతో కార్మికుల నిరసన - dead body
మడకశిరలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం ముందు ఉద్యోగి మృతదేహంతో కార్మికులు నిరసనకు దిగారు. జీతాలు అందక తమ సహ ఉద్యోగి మరణించాడని ఆరోపించారు.
అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలోని నీలకంఠాపురం శ్రీ రామిరెడ్డి తాగునీటి పథకం సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న రామప్ప అకస్మాత్తుగా మరణించాడు. 4 నెలలుగా జీతాలు అందక ఆర్థిక సమస్యలతో మనస్థాపానికి గురై గుండెనొప్పి రావటంతో మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. గురువారం మడకశిర పట్టణంలోని శ్రీరామరెడ్డి తాగునీటి పథకం కార్యాలయం ఎదుట రామప్ప మృతదేహంతో కార్మికులు, మృతుడి కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. బాధితుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని.. ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులకు భద్రత కల్పించి వేతనాలు సక్రమంగా అందించాలని నాయకులు డిమాండ్ చేశారు.