అనంతపురం జిల్లా మడకశిర 8వ వార్డు శివపురం కాలనీవాసులు ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ.. ఖాళీ బిందెలతో మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు.
WATER PROBLEM : మాకు మంచినీళ్లు కావాలి.. ఖాళీ బిందెలతో నిరసన - madakasira
తాగునీటి సమస్యను తీర్చాలని మున్సిపల్ కార్యాలయం ముందు మహిళలు ఆందోళన చేపట్టారు. ఖాళీ బిందెలతో బైఠాయించి నినాదాలు చేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లా మడకశిరలో జరిగింది.
నీటి సమస్యను పరిష్కరించాలంటూ...ఖాళీ బిందెలతో నిరసన
కొన్ని నెలలుగా కాలనీలోని బోరు మరమ్మతులకు గురవడంతో.. నీటి సమస్య ఏర్పడిందని మహిళలు కమిషనర్ ప్రభాకర్ రావుకు తెలిపారు. కూలిపని చేసుకునే తాము.. నీటి కోసం డబ్బు వెచ్చించడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన కమిషనర్.. సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు ఆందోళన విరమించారు.
ఇదీచదవండి :