ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యాయం చేయాలంటూ మహిళ నిరసన..తహసీల్దారు కార్యాలయానికి తాళం - నల్లచెరువు తహశీల్దార్‌ కార్యాలయం

Women former locked MRO Office and Agitation
తహశీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసిన మహిళ

By

Published : Sep 28, 2021, 1:06 PM IST

Updated : Sep 28, 2021, 3:58 PM IST

13:01 September 28

తహశీల్దార్‌ కార్యాలయానికి తాళం వేసిన మహిళ..సమస్య పరిష్కరించాలని నిరసన

అనంతపురం జిల్లా నల్లచెరువు మండలం పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన నారాయణమ్మకు భర్త ద్వారా సంక్రమించిన మూడెకరాల భూమిని.. రికార్డుల నుంచి తొలగించి దాయాదులు వారి పేరిట ఎక్కించుకున్నారు. ఈ విషయాన్ని తహసీల్దార్, ఆర్​ఆర్​డిఓ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదంటూ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. పదుల సార్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాతల కాలం నుంచి సంక్రమించిన భూమికి దస్తావేజులు, రికార్డులను ఎక్కడినుంచి తేగలనని వాపోయింది. మరోదారి లేకనే తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి.. బైఠాయించినట్లు (woman farmer locked mro office and protest at nallacheruvu) నారాయణమ్మ తెలిపారు. 

ఇద్దరు కుమార్తెలతో కలసి కార్యాలయం వద్దకు వచ్చిన ఆమె ఓ దశలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది. పోలీసులు రెవెన్యూ అధికారులు మహిళకు నచ్చజెప్పి ఆమెను పోలీస్ స్టేషన్ (Police station)కు తరలించారు. తమ దాయాదులు ఇబ్బందులు కలిగించకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను నారాయణమ్మ కోరింది.

ఇదీ చదవండి :    

 Lovers Suicide in Gadwal at Telangana : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య

Last Updated : Sep 28, 2021, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details