అనంతపురం జిల్లా పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో విషాదం నెలకొంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో.. సుంకులమ్మ అనే వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య మృతిని తట్టుకోలేక భర్త జయకేశవ విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు తాడిపత్రిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం
అనంతపురం జిల్లా పుట్లూరులోని కడవకల్లులో.. వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఇది తట్టుకోలేక.. భర్త సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం