రాష్ట్రంలో సంచలనంగా రేపిన అనంతపురం జిల్లా యువతి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మను ఎస్సీ సంఘం నేతలు అడ్డుకున్నారు. జిల్లాలోని ధర్మవరంలో స్నేహలత అనే అమ్మాయిపై బుధవారం హత్య చేయగా.. సంఘటనపై మహిళా కమిషన్ ఛైర్మన్ వాసిరెడ్డి పద్మ మృతురాలి కుటుంబాన్ని పరామర్శించటానికి అనంతపురం వచ్చారు. ఇలాంటిది ముందుగానే జరిగే అవకాశం ఉంటుందని పోలీసుల వద్దకు వెళితే తమ ఫిర్యాదు తీసుకోలేదని యువతి కుటింబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పోలీసుల నిర్లక్ష్యం వల్లనే తమ కూతుర్ని కోల్పోయామని మృతురాని తల్లి లక్ష్మిదేవి కన్నీటి పర్యంతమయ్యారు.
అనంత పర్యటనలో వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న ఎస్సీ సంఘం నేతలు - మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మ తాజా
అనంతపురం జిల్లాలో హత్యకు గురైన యువతి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మను ఎస్సీ సంఘం నేతలు అడ్డుకున్నారు. నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేయాలని వారు డిమాండ్ చేశారు
మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మను అడ్డుకున్న ఎస్సీ సంఘం నేతలు
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళుతున్న వాసిరెడ్డి పద్మను ఎస్సీ సంఘం నేతలు అడ్డుకున్నారు. ఆమె వాహనానికి అడ్డుగా నిలబడి నినాదాలు చేశారు. వాహనం దిగి వారితో మాట్లాడిన వాసిరెడ్డి పద్మ.. నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు. ఫిర్యాదు తీసుకోని పోలీసుల విషయాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి.. చర్యలు తీసుకునేలా చేస్తామని ఆమె హామీఇచ్చారు.
ఇదీ చదవండి:యువతి హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం