ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహం కలకలం - హంద్రీనీవా కాలువ ఎల్11 పంప్ హౌజ్

మడకశిర పరిధిలోని హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతురాలు కర్ణాటక ప్రాంతం పెద్దదాలవాటకు చెందినవారుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Woman's body found in Handrineva canal
హంద్రీనీవా కాలువలో మహిళ మృతదేహం కలకలం

By

Published : Nov 14, 2020, 10:34 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం కల్లుమరి సమీపంలోని హంద్రీనీవా కాలువ ఎల్11 పంప్ హౌజ్ వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. మృతురాలు కర్ణాటక ప్రాంతం పెద్దదాలవాటకు చెందినవారుగా గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవాగారానికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details