అనంతపురం జిల్లా సోమందేపల్లికి చెందిన అలివేలమ్మ అనే మహిళ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే అలివేలమ్మ మరణించిందని మృతురాలి కుటుంబ సభ్యులు మృతదేహంతో ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. మహిళ మృతికి కారణమైన వైద్యుణ్ని అరెస్టు చేసి, ఆస్పత్రిని సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళనకారులకు సీఐటీయు, ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు మద్దతు తెలిపారు.
ప్రైవేటు ఆస్పత్రిలో మహిళ మృతి.. మృతదేహంతో బంధువుల ఆందోళన - \protest infront of hospital
అనంతపురం జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఓ మహిళ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఆమె మరణించిందని మృతురాలి కుటుంబీకులు మృతదేహంతో ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు.
ఆస్పత్రి ఎదుట మృతదేహంతో ఆందోళన