అనంతపురం జిల్లా కదిరికి చెందిన మోహన్.. .హైదరాబాద్‌లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే కంపెనీలో పనిచేస్తోన్న విజయవాడకు చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో వారిద్దరు శారీరకంగా ఒక్కటయ్యారు. అనంతరం పెద్దలను ఒప్పించి, పెళ్లి చేసుకుందామని నమ్మించి మోసం చేశాడని బాధితురాలు వాపోయింది. మోహన్ తల్లిదండ్రులు తమ పెళ్లిని అంగీకరించలేదని, ఆగస్టు నుంచి మోహన్‌తో తనను మాట్లాడనీయలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు న్యాయం చేయాలంటూ మోహన్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. తనను పెళ్లి చేసుకునేంతవరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేసింది.
న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన
ప్రేమిస్తున్నానని, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామని నమ్మించి... మరో యువతితో పెళ్లికి సిద్ధమవుతున్న యువకుడి ఇంటి ఎదుట ఓ యువతి ఆందోళనకు దిగింది. ఈ ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది.
న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ఎదుట యువతి ఆందోళన c