ఎంపీపీ పదవి ఇస్తామని చివర్లో ఎమ్మెల్యే మాట తప్పారని ఆరోపిస్తూ రాజీనామాకు సిద్ధమయ్యారు అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ఎంపీటీసీ రామలక్షమ్మ. భర్త ఆదినారాయణతో కలిసి పార్టీకి, ఎంపీటీసీ స్థానానికి రాజీనామా చేస్తామని ప్రకటించారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, వైకాపా నాయకులు.. ఎంపీటీసీ, ఆమె భర్తతో మాట్లాడారు. సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో రామలక్షమ్మ వెనక్కి తగ్గారు. రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు మరోసారి ప్రకటించారు.
YCP MPTC: 'రాజీనామా నిర్ణయం ఉపసంహరించుకుంటున్నా' - ycp mpts in ananthapur district
ఎంపీపీ పదవి ఇస్తామని చివర్లో ఎమ్మెల్యే మాట తప్పారని ఆరోపిస్తూ రాజీనామాకు సిద్ధమయ్యారు అనంతపురం జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి ఎంపీటీసీ రామలక్షమ్మ. వైకాపా నాయకులు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆమె వెనక్కి తగ్గారు.
రాజీనామా నిర్ణయం ఉపసంహరించుకుంటున్నాం -ఎంపీటీసీ