అనంతపురం నగరంలోని పాతురు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ పైభాగం కూలింది. విషయం తెలుసుకున్న నగర మేయర్ వసీం… దానిని పరిశీలించారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ ట్యాంక్‌ని నిర్మించారని… శిథిలావస్థకు చేరటంతో కూలిపోయిందని చెప్పారు. అక్కడ ఇప్పటికే మరో వాటర్ ట్యాంక్ నిర్మించారని…. పాతది కూలిపోయినప్పటికీ నీటి సమస్య తలెత్తే అవకాశం లేదని అన్నారు.
కూలిన వాటర్ ట్యాంక్‌లో ఉన్న నీటిని ఖాళీ చేయించాలని అధికారులను మేయర్ ఆదేశించారు. అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో చర్చించి పాత ట్యాంక్‌ను పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించేలా చర్యలు తీసుకుంటామన్నారు. కూలిన భాగం... ట్యాంక్ లోపలి భాగంలో పడిపోయిన కారణంగా... ప్రమాదం తప్పిందని మేయర్‌కు అధికారులు తెలిపారు.