ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హంద్రీనీవా కాలువకు నీటి విడుదల - అనంతపురం జిల్లా వార్తలు

అనంతపురం జిల్లాలోని రాగులపాడు ఎనిమిదో లిఫ్ట్​ ద్వారా హంద్రీనీవా కాలువకు అధికారులు నీటిని విడుదల చేశారు. నాలుగు పంపుల ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

water release to handrineeva canal in ananthapuram district
హంద్రీనీవా కాలువకు నీటి విడుదల

By

Published : Jul 26, 2020, 3:32 PM IST

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని రాగులపాడు ఎనిమిదో లిఫ్ట్​కు కృష్ణా జలాలు చేరుకున్నాయి. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అధికారులు... నాలుగు పంపుల ద్వారా 1200 క్యూసెక్కుల నీటిని హంద్రీనీవా కాలువలోకి విడుదల చేస్తున్నారు. ఈ జలాలు.. ఉరవకొండ మండలం మీదుగా జీడిపల్లి రిజర్వాయర్ కు చేరుకున్నాయి. సుదీర్ఘ సమయం తర్వాత ప్రాజెక్టులో నీరు చేరటంతో పరిసర ప్రాంతాల్లోని రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details