అనంతపురం జిల్లా ఉరవకొండలో ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారు. ఇక్కడ దాదాపు 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. ఇప్పడు ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్య పరిష్కారం కావడంలేదని వాపోతున్నారు. కాలనీకి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైపులైను పగిలిపోయింది. ఈ కారణంగా... తాగునీటికి తీవ్ర ఇబ్బంది ఎదురైంది. విధిలేని పరిస్థితుల్లో... పగిలిన పైపు లోంచే గ్రామస్థులు నీరు పట్టుకుంటున్నారు. మురుగుకాలువ పక్కనే పైపు పగలిన పరిస్థితుల్లో.. వస్తున్న ఆ కాస్త నీరూ.. కలుషితమవుతోంది. ఫలితంగా... రోగాలు వస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి' - uravakonda
ఏళ్ల నుంచి అక్కడ తాగునీటి సమస్య ఉంది. ఆ కాలనీకి నీరు సరఫరా చేసే ప్రధాన పైపులైను పగిలిన కారణంగా... ఆ కష్టాలు మరింత అధికమయ్యాయి. పగిలిన పైపులోంచే వచ్చే నీటినే పట్టుకుంటూ ప్రజలు దాహార్తి తీర్చుకుంటున్నారు.
'తాగునీరు రావడం లేదు సార్.. పట్టించుకోండి'