అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం చాగళ్ళు జలాశయం కుడికాలువ కోతకు గురై నీరు వృథా అవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు జలాశయంలోకి పెద్దఎత్తున నీరు చేరింది. సామర్థ్యానికి మించి నీరు ఉన్నందున అధికారులు 2 రోజుల క్రితం నీటిని ఎడమ, కుడి కాలువలకు వదిలారు. అయితే కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండానే నీళ్లు వదలటంతో కుడి కాలువ కోతకు గురై కల్వర్టు కూలిపోయింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది.
చాగళ్లు జలాశయం కుడికాలువ నుంచి వృథాగా పోతున్న నీరు - చాగళ్లు జలాశయం
అనంతపురం జిల్లా పెద్దపప్పురు మండలం చాగళ్ళు జలాశయం కుడి కాలువ కోతకు గురై నీరు వృథా అవుతోంది. ఎలాంటి మరమ్మతులు చేపట్టకుండానే నీళ్లు వదలటంతో కుడి కాలువ కోతకు గురై కల్వర్టు కూలిపోయింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది.
చాగళ్లు జలాశయం కుడికాలువ నుంచి వృథాగా పోతున్న నీరు