ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 7, 2022, 7:44 PM IST

ETV Bharat / state

Vigilance raids : విజిలెన్స్ అధికారులు దాడులు.. దుకాణాలు తాళాలు వేస్తున్న వ్యాపారులు

Vigilance raids : రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని సాకుగా చూపి.. వినియోగదారుల్ని దోచుకుంటున్న వంటనూనెల వ్యాపారులే లక్ష్యంగా విజిలెన్స్ అధికారులు పలు జిల్లాల్లో తనిఖీలు చేపట్టారు. కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వ్యాపారుల్ని హెచ్చరించారు. అధికారుల సోదాల సమాచారంతో కొంతమంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేస్తున్నారు.

Vigilance raids
Vigilance raids

Vigilance raids : గుంటూరు జిల్లాలోని సత్తెనపల్లి, పిడుగురాళ్ల, వినుకొండ, బాపట్ల, రేపల్లెలోని పలు దుకాణాల్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నిత్యావసర వస్తువుల బ్లాక్ మార్కెట్ విక్రయాలు పెరిగిపోతుండటంతో అధికారులు దాడులు చేపట్టారు. నిత్యావసర సరుకుల స్టోర్స్, దుకాణాలు, వంట నూనెల గోడౌన్స్, ఎరువుల దుకాణాల్లో తనిఖీలు చేసి.. రికార్డ్స్ పరిశీలించారు. సరుకులు ఎమ్మార్పీ ధరల కంటే అధికంగా అమ్ముతూ, ప్రమాణాలు సరిగా లేని దుకాణాలపై కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

దుకాణాలు తాళాలు వేస్తున్న వ్యాపారులు..

అనంతపురం జిల్లా హిందూపురం, కళ్యాణదుర్గం పట్టణంలో వంట నూనె దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రం నుంచి వచ్చిన అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఈ సోదాలు నిర్వహించారు. రికార్డులన్నీ పరిశీలిస్తున్నామని.. తేడాలు ఉంటే కేసులు నమోదు చేస్తామన్నారు. అధికారుల సోదాల సమాచారంతో కొంతమంది వ్యాపారులు దుకాణాలకు తాళాలు వేస్తున్నారు.

ఇదీ చదవండి :యుద్ధం సాకుతో వంటనూనెల ధరలకు రెక్కలు... రంగంలోకి విజిలెన్స్​ అధికారులు

ABOUT THE AUTHOR

...view details