ఆ డెయిరీ కోసం మేమెందుకు ప్రచారం చేయాలి: పశువైద్యులు - అనంతపురం పశుసంవర్ధకశాఖ జేడీ కార్యాలయంలో పశువైద్యుల ఆందోళన
12:57 October 28
అమూల్ డెయిరీకి పనిచేయిస్తున్నారని పశువైద్యుల ఆందోళన
అమూల్ సంస్థ.. ఒక్క ఉద్యోగిని కూడా నియమించకుండా, ప్రభుత్వ ఉద్యోగులతో పాలసేకరణ మెంటార్ విధులు అప్పగించిందని పశువైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురంలో పశువైద్యులు.. ఆ శాఖ జేడీ కార్యాలయం వద్ద తీవ్ర స్థాయిలో ఆందోళన నిర్వహించారు. పొరుగు జిల్లాల్లో రైతులకు పాల బిల్లులు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్న అమూల్ తీరుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పశువైద్యులను పాల సూపర్ వైజర్లుగా మార్చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
త్వరలో అనంతపురంలో జిల్లాలో పాలసేకరణ మొదలు పెట్టే అమూల్ సంస్థ ఒక్క ఉద్యోగిని కూడా నియమించకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులతో పనిచేయిస్తోందని ఆరోపించారు. పశువైద్యులను మెంటర్లుగా నియమించి అమూల్ కే పాలు పోసేలా.. పాడి రైతులకు అవగాహన కల్పించే బాధ్యతలు అప్పగించారని వైద్యులు మండిపడ్డారు. పశుసంవర్థకశాఖ జేడీ ఛాంబర్ వద్ద పశువైద్యులు బైఠాయించి నినాదాలు చేశారు.
ఇదీ చదవండి:సీఎంతో సినీ ప్రముఖులు భేటీ.. సినీ రంగానికి సంబంధించి పలు అంశాలపై చర్చ