ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నూర్పిడి చేసే స్థోమత లేక వేరుశనగ పంటను దున్నేస్తున్న రైతులు'

తెదేపా హయాంలో అన్నదాతలను వివిధ రూపాల్లో ఆదుకునేవారని... ప్రస్తుత ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోట్లేదని తెదేపా నియోజకవర్గ ఇన్​ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు.

umamaheshwara nayudu comments on government
'ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలి'

By

Published : Oct 26, 2020, 10:39 PM IST

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం చింతల పల్లి గ్రామంలో మల్లికార్జున అనే రైతు తన మూడు ఎకరాల పొలంలో వేసిన వేరుశనగను నూర్పిడి చేసుకోలేదు. ఆ పరిస్థితి లేక దున్నేశాడు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం నియోజకవర్గ ఇన్​ఛార్జి ఉమామహేశ్వర్ నాయుడు... స్థానిక నాయకులతో కలిసి ఆ రైతు పొలంలో పర్యటించారు. ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

వైకాపా ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే జిల్లాలో ఇప్పటికే 70మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఉమామహేశ్వర నాయుడు అన్నారు. వెంటనే అనంతపురం జిల్లా రైతాంగాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

భారం భరించలేక...

తన మూడు ఎకరాల పొలంలో ఇప్పటికే రూ. 60 వేలు వెచ్చించాడు ఆ రైతు. ఇప్పుడు మళ్లీ నూర్పిళ్లు చేసి వేరుశెనగ కాయలు తీయాలంటే మరో రూ. 30 వేలదాక ఖర్చు అవుతుంది. ఈ ఆర్థిక భారం భరించలేక శనగ పంటను దుక్కిలోకి దున్నేస్తున్నామని రైతు వివరించాడు.

ఇదీ చూడండి:

నకిలీ విత్తనాలతో నష్టపోయిన ఎమ్మెల్యే ఆర్కే

ABOUT THE AUTHOR

...view details