అనంతపురం జిల్లా కొత్తచెరువు మండలం అప్పాలోల్లపల్లికి చెందిన కూలీలు.. వేరుశెనగ కాయలను నూర్పిడి చేసేందుకు గుంటిపల్లికి వెళ్తుండగా... వారు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో ప్రమీలాబాయి, శాంతాబాయి అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృత్యువాత పడటం వల్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి, శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను పెనుగొండకు తరలించారు.
గుంటిపల్లిలో విషాదం... రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి - news updates in ananthapuram district
కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్లిన ఇద్దరు మహిళలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. తమ మీదే ఆశలు పెట్టుకున్న కుటుంబ సభ్యులను కన్నీటి సంద్రంలో ముంచారు. ఇంతటి ఈ విషాద ఘటన అనంతపురం జిల్లా గుంటిపల్లిలో జరిగింది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి