ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బతికుండగానే భర్త సమాధి పక్కన భార్యల సమాధులు

ఏడాది కిందట భర్త కన్నుమూశాడు. ఆయనపై ప్రేమతో అతడి ఇద్దరి భార్యలూ బతికుండగానే ఆయన సమాధి పక్కనే తమకూ సమాధులు కట్టించుకున్నారు. వీరికి పిల్లలు లేకపోవడంతో వారు సంపాదించిన ఆస్తులను సేవా కార్యాక్రమాలకు ఖర్చుచేశారు. ఈ అరుదైన ఉదంతం అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

బతికుండగానే భర్త సమాధి పక్కన భార్యల సమాధులు
బతికుండగానే భర్త సమాధి పక్కన భార్యల సమాధులు

By

Published : Sep 20, 2021, 12:27 PM IST

భర్తపై ప్రేమతో ఆయన సమాధి పక్కనే తమ సమాధులు ఉండాలని బతికుండగానే వాటిని నిర్మించుకున్న మహిళల ఉదంతమిది. అనంతపురం మండలం కామారుపల్లి గ్రామానికి చెందిన కురబ రాగే పెద్ద కొండన్నది సామాన్య రైతు కుటుంబం. ఆయనకు అంజినమ్మ, యల్లమ్మ ఇద్దరు భార్యలు. వీరికి సంతానం లేదు. సంపాదించిన రూ.5 కోట్లు సేవకు ఖర్చు చేశారు. ఏడాది కిందటే కొండన్న మృతిచెందారు. ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా కామారుపల్లిలోని సొంత పొలంలో ఓ ఘాట్‌ కట్టించారు. అందులో భర్త సమాధికి రెండు వైపులా అంజినమ్మ, యల్లమ్మ సమాధులూ నిర్మాణం చేయించుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details